మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "రంగస్థలం" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రూ.100 కోట్ల షేర్ సాధించినప్పటికీ ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతుండటం విశేషం. ఇక చరణ్ చేయబోయే తదుపరి చిత్రం బోయపాటి శ్రీనుతో అనే విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, బోయపాటి సినిమా టైటిల్స్ హీరోయిజం ఉట్టిపడేలా.. ఎంత మాస్‌గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసం లేదు. ఒక్క "జయ జానకి నాయక" చిత్రం ఒక్కటే క్లాస్‌గా అనిపిస్తుంది. చరణ్ మూవీకి "రాజవంశస్థుడు" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. చరణ్ టైటిల్ కన్ఫర్మ్ అవ్వాలంటే.. ఒక్క చరణ్‌కి నచ్చితే సరిపోదు. మెగాస్టార్ చిరంజీవికి నచ్చాలి. అప్పుడే టైటిల్ కన్ఫర్మ్ అయినట్టు లెక్క.