మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంచలన చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. చరణ్ - సమంత జంటగా నటించిన 'రంగస్థలం' మూడో వారంలోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తుండటం విశేషం. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లో 'రంగస్థలం' గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన రంగస్థలం 13 రోజుల్లో రూ.175 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాని గతంలో తమిళ్‌లోకి డబ్ చేయాలనుకుంటున్నట్టు చరణ్ తెలియచేసారు. ఇప్పుడు తమిళ్‍లోనే కాకుండా.. హిందీ, మలయాళం, భోజ్‌పురి భాషల్లోకి కూడా అనువదించాలని చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలుగులో సంచలనం సృష్టించిన 'రంగస్థలం' వేరే భాషల్లో కూడా అనువదమై విజయం సాధిస్తుందని ఆశిద్దాం.