టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాస్త పెద్ద గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ తేజ ప్రస్తుతం తన తండ్రి 150వ చిత్రం గురించి చాలా బిజీగా ఉన్నాడు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా జోరుగా నడుస్తోంది. ఐతే తదుపరి చిత్రం ఏంటా అని చెర్రీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో రాంచరణ్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా తను నటించబోయే చిత్రం త్వరలో పట్టాలెక్కబోతున్నట్లు ప్రకటించాడు. ఐతే మంచి కథ కోసం బాబాయ్ ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి కత్తిలాంటోడు టైటిల్ ప్రచారం కావడంపై మాట్లాడుతూ... నాన్న 150వ సినిమా టైటిల్ అది కాదన్నారు. ఇంకా సినిమా టైటిల్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికే పలు టైటిళ్ల గురించి చర్చ జరుగుతోందనీ, మంచి టైటిల్ సెలెక్ట్ చేసి దాన్ని చిత్రానికి పెడతామని చెప్పుకొచ్చారు.