ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎనౌన్స్ చేసాడు, మరి చరణ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?

గురువారం, 26 మార్చి 2020 (22:31 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా 2021 జనవరి 8న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే... ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మూవీ చేయనున్నారు. 
 
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా 2021 సమ్మర్లో రిలీజ్ కానుందని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది.
 
 ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమాని ఎనౌన్స్ చేసాడు కానీ... చరణ్‌ మాత్రం నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఎనౌన్స్ చేయలేదు. దీంతో చరణ్‌ తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. 
 
నానితో జెర్సీ అనే విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి చరణ్‌కి ఓ కథ చెప్పాడని.. ఈ కథ చరణ్‌‌కి బాగా నచ్చిందని.. ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... చరణ్ తదుపరి చిత్రం గురించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... మనం సినిమాతో అద్భుత విజయం సాధించి అందరి దృష్టి ఆకర్షించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ చరణ్‌ కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేసారని.. అది ఇటీవల చరణ్ కి చెప్పారని తెలిసింది.
 
ఈ కథ చరణ్ కి విన్న వెంటనే నచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఈ కథ పై మరింతగా వర్క్ చేస్తున్నారని.. ఈ సినిమా దాదాపు కన్ ఫర్మ్ అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. చరణ్‌ - విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలిసింది. 
 
13 బి, ఇష్క్, మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్... ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కుమార్ చరణ్‌ కి ఏతరహా కథ చెప్పాడు. చరణ్‌ ని ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మనం తర్వాత ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయిన విక్రమ్ కె కుమార్ చరణ్‌తో చేసే సినిమాతో అయినా బిగ్ హిట్ సాధిస్తాడని ఆశిద్దాం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు