Ram Charan felicitating Karnataka CM Siddaramaiah with a shawl
ఇటీవలే షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్ చరణ్ తిరిగి మైసూర్ వెళ్ళారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు.