కైరా అద్వానీ శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్లు చాలా అందంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పైగా, గతంలో తనకు సరైన డ్యాన్స్ పార్టనర్ తమన్నా అని చెప్పానని, ఇపుడు కైరా అద్వానీ మంచి డాన్సింగ్ పార్టనర్ అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చారు. అయితే, కైరా అద్వానీ కళ్లు అంటే ఇష్టమని చెప్పిన చెర్రీకి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కైరా నేత్రాలు సరే.. భార్య ఉపాసన కళ్లు బాగోలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని రామ్ చరణ్ వివరించాడు. 'వినయ విధేయ రామ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శరీరమంతా టూటూలతో కనిపిస్తాను. అవి స్టిక్కర్లతో వేసిన టూటూ. అవి వేయడానికి 2 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. స్టిక్కర్లు తొలగించే సమయంలో చాలా నొప్పిగా కలిగేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.