రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే... ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత... రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.
ఇక మెగా కుటుంబానికి చెందిన వారంతా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చరణ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ మాత్రం మరింత చనువుగా.. నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు..తీసుకో బావ నా ఈ బండ ప్రేమను.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.