మరోవైపు, "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని లక్ష్మీపార్వతి దృక్కోణం నుంచి తీసినట్టు వెల్లడించారు. ఇందులో కల్పితాలు ఏవీ లేవనీ, అన్నీ నిజాలే ఉంటాయన్నారు. అయితే, ఈ చిత్రం విడుదలైతే నిజాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకాకుండా అడ్డుకున్నారనీ చెప్పారు.
పైగా, రైతుల కష్టాలు తనకు తెలియవన్నారు. తాను ఎపుడూ పొలం పనులు చేయలేదన్నారు. రాజకీయాల్లోకి రాను, ప్రజలకు సేవచేసే ఉద్దేశం నాకు లేదని వర్మ తేల్చి చెప్పారు. అదేసమయంలో త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తీయబోతున్నట్టు చెప్పారు.