పవన్ కుమారుడి పేరుపై రచ్చ.. వర్మ పోస్టుపై కుమార్తె ఫైర్.. పనిలేక పోస్టులు చేస్తున్నావా?

గురువారం, 2 నవంబరు 2017 (09:48 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడి పేరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన నాలుగో బిడ్డకు పెట్టిన 'మార్క్ శంకర్ పవనోవిచ్' అనే పేరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన తనదైన శైలిలో పోస్టు చేశాడు. 
 
వర్మ పోస్టుపై స్వయంగా ఆయన కుమార్తె మండిపడింది. వీరిద్దరి మధ్య పవన్ కుమారుడి పేరు పెద్ద రచ్చకు దారితీసింది. ఈ పేరుకు, చరిత్రకు సంబంధాన్ని తెలుపుతూ, వర్మ చేసిన పోస్టుకు వర్మ కుమార్తె రేవతి వర్మ స్పందించింది. ఈ పేరుకు, చరిత్రకు లింకేంటి.. ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదని.. సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడం ఏంటని తప్పుబట్టింది. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. 
 
ఇక స్వతహాగా పవన్‌కు పెద్ద ఫ్యాన్ అయిన రేవతి వర్మ వ్యాఖ్యలను వర్మ ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. నీకసలు అర్థం చేసుకోవడమే రాదని అక్షింతలు వేశాడు. అందరికంటే పవన్ కల్యాణ్‌ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని.. తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు