ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పట్టాభితో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. యుద్దానికి మేము సై… అంటే మేము సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అయితే తాజాగా రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్‌లో స్పందించే వర్మ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు కరాటే, బాక్సింగ్… కర్ర సాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.