రామ్ రెడ్ టీజర్ రియాక్షన్ ఏంటి..?

శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:12 IST)
క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్న‌ది ముందే రివీల్ కాకూడ‌దు. ఆడియెన్ ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున కూచుని చూడ‌గ‌లిగేలా చేస్తేనే స‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్ల‌ర్లు ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే మ‌రో ప్ర‌య‌త్నం `రెడ్`. 
 
రామ్ పోతినేని (#రాపో) క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌ స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.
 
తాజాగా టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ ఆద్యంతం అస‌లేం జ‌రుగుతోంది? అన్న స‌స్పెన్స్ ఎలిమెంట్ ర‌క్తి క‌ట్టిస్తోంది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభిన‌యం ఊహ‌కంద‌ని ట్విస్టుల‌తో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ హిస్ట‌రీలో ఇలాంటి కేసు చూడ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటూ మొద‌లు పెట్ట‌డం ఆస‌క్తిని పెంచింది. సిద్ధార్థ్.. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ లైఫ్స్.. డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్ అంటూ లేడీ కాప్ నివేద ఇన్వెస్టిగేష‌న్లో చెప్పేసింది కాబ‌ట్టి .. రాపో ఒక్క‌డు కాదు ఇద్ద‌రు అని భావించేందుకే స్కోప్‌ ఉంది. 
 
అయితే ఆ రెండు పాత్ర‌ల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఉంద‌ని ట్రైల‌ర్ ముగింపులో `నేనే` అనే డైలాగ్‌తో క్లూ ఇచ్చేశారు? అస‌లింత‌కీ ఆ క్లూ వెన‌క ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే. 
 
రామ్ కెరీర్ బెస్ట్ లుక్‌తో క‌నిపించ‌బోతున్నాడు ఈ సినిమాలో. రెండు డిఫ‌రెంట్ గెటప్పుల‌తో ట్రైల‌ర్లో ఎంతో ఎనర్జిటిక్‌గా క‌నిపించాడు. క్రిమిన‌ల్ గెట‌ప్‌కి.. సాఫ్ట్వేర్ వేషానికి మ‌ధ్య డిఫ‌రెన్స్ ఆక‌ట్టుకుంది. నివేద‌ థామ‌స్, మాళ‌విక శ‌ర్మ, నాజ‌ర్, అమృత అయ్య‌ర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంది. 
 
ఈ క్రేజీ సినిమాలో రెండు పాట‌ల్ని యూర‌ప్ డోల‌మైట్స్.. ఇటలీ ప‌ర్వ‌త సానువుల్లో తెర‌కెక్కించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. స‌ముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీక‌రించిన పాట హైలైట్‌గా ఉండ‌నుంది.
 
ఇదో స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్టైన్‌మెంట్ హైలెట్‌గా నిలుస్తాయి. ఒక పాట చిత్రీక‌ర‌ణ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండడం సంతోషంగా ఉంది.  ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చిత్ర నిర్మాత తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు