2019 సంవత్సరంలో నిర్మాతగా మారి ఎంతో ప్రతిష్టాత్మకంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తీసి, తన తండ్రి చిరంజీవికి కానుకగా ఇచ్చారు. ఇక తాను నటించబోయే సినిమాలపై ఈ ఏడాది దృష్టి సారించనున్నారట. ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్' రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ అందులో తండ్రి చిరంజీవితో కలిసి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇటీవలి సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ తమిళంలో కార్తితో ‘ఖైదీ' వంటి డిఫరెంట్ మూవీతో హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తర్వాత మూవీని కన్ఫామ్ చేసినట్లు, RRR పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పనులు మొదలు కానున్నట్లు సమాచారం.