'బాహుబలి'లో శివగామిగా గుర్తిండిపోయే పాత్ర చేసి మెప్పించి.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పటికే 'శభాష్ నాయుడు'లో కమల్ హాసన్‌కి జంటగా నటిస్తోంది. దీంతో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య చేస్తోన్న చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది.
కీలక పాత్ర, హీరోతో ఒక్క సీన్ కూడా లేకుండా ఎలా డిజైన్ చేశాడన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలంటోంది రమ్య కృష్ణ. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. ఇందులో వీలైతే నయనతారతో అతిథి పాత్రని ప్లాన్ చేయడానికి దర్శకుడు ట్రై చేస్తున్నాడట. ఇక, సూర్య నటించిన 'సింగం-3' ఈనెల 23వ తేదీన క్రిస్మస్ గిఫ్ట్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది.