హైదరాబాద్ నగరం, ఎల్బీ నగర్‌కు చెందిన బుల్లితెర నటిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. టీవీ ఆర్టిస్టు రూప ఎల్బీనగర్‌లో నివసిస్తోంది. అదేప్రాంతంలో అనంతపురానికి చెందిన గిరీశ్ కూడా ఉంటున్నాడు. గతకొంతకాలంగా రూపను వెంటాడుతున్న గిరీశ్... ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో రూపకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు రహస్యంగా తీసిన గిరీశ్, తన మాట వినకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు.
ఈ నేపథ్యంలో అనంతపురంలో తన ఇంటికి రూపను తీసుకువెళ్లి నిర్బంధించి, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గిరీశ్ బారి నుంచి ఏదో విధంగా తప్పించుకుని బయటపడ్డ రూప హైదరాబాద్ చేరుకుంది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఈ రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్బీనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతపురంలో గిరీశ్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.