రష్మీ గౌతమ్ వంద ఎకరాలు కొనేసిందట.. ఆ భూమిలో ఏం చేయబోతుందో తెలుసా?

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:45 IST)
జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమై ప్రస్తుతం యాక్టర్‌గా మారిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం వేరొక అవతారం ఎత్తనుంది. వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం. వంద ఎకరాల మేర భూమిని కొనుగోలు చేసిన ఈమె.. ఆ భూములతో వ్యవసాయం చేయనుందట. 
 
ఆర్గానిక్ వ్యవసాయం కోసం ఈ భూములు కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా.. కొన్ని పొలాలు కౌలుకు ఇచ్చి సాగుచేయాలనే ఆలోచనలో వుందని వార్తలు వస్తున్నాయి. ఇక యాంకర్‌గా కెరీర్ మరో ఐదేళ్లు గడిచే ఛాన్సుండటంతో.. ఆ తర్వాత తాను కొన్న వ్యవసాయ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చునని.. రష్మీ భావిస్తుందట.
 
తాను కొన్న వ్యవసాయ భూముల్లో రష్మీ ఎక్కువగా కోకా, మామిడి, నేరేడు వంటి పండ్లకు సంబంధించిన పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్ ఈ వ్యవసాయ భూముల్లో తన పెంపుడు కుక్కతో షికారుకు కూడా వెళ్లింది. ఆ ఫోటోలను రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు