ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ మామూలే. ఎంతమంది ఎంతగా నెపోటిజంపై ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే వారు వస్తూనేఉన్నారు..వెళ్లేవారు వెళుతూనే ఉన్నారు. ఈ వారసుల పరంపర కొనసాగడం మాత్రం ఆగడంలేదు. మెగాస్టార్ చిరంజీవికి తర్వాత ఆ కుటుంబం నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చారు. నిన్నగాక మొన్నొచ్చిన విజయ్ దేవరకొండ కూడా తన స్టామినాతో తమ్ముడు ఆనంద్‌ను పరిచయం చేశాడు.