Naveen polishetty, theater
హీరో అభిమాని హీరో అయితే చాలా చిత్రంగా వుంటుంది. ఇప్పటి జనరేషన్ అంతా గతంలో ఏదో ఒక సినీ హీరోకు అభిమానులే. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానే. తన సినిమాల ప్రమోషన్ ని ప్రభాస్ ద్వారా చేయించిన సందర్భాలున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న కేరెక్టర్ వేసి ఆ తర్వాత తన నటనతో కథానాయకుడి స్థాయికి ఎదిగి, అనుష్క కాంబినేషన్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పేరుతో సినిమా చేసి సక్సెస్ సాధించుకున్నారు. కొంత గేప్ తీసుకున్న ఆయన తాజాగా `అనగనగా రాజు` అనే పేరుతో సినిమా చేస్తున్నారు.