kalyan, ashock kumar, ravendra and others
రవీంద్ర గోపాల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం 'దేశం కోసం'. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ మాట్లాడారు. రవీంద్ర గోపాల్ ఈ సినిమాలో 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు పోషించాడు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఈ సినిమా తన కోసం కాదు. దేశం కోసం చేసిన సినిమా' అని అన్నారు. నేటి తరానికి గాంధీ, భగత్ సింగ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్య్రం అనే విషయం వారికి తెలియజేయడం ఈ చిత్ర కథాంశం.