పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తను పవన్ గురించి నిత్యం మాట్లాడుతాననీ, ఆయనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తాననీ, దానిని ఎవ్వరూ అడ్డుకోలేరనీ ఓ సంచలన ఇంటర్య్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు చర్చించారు. పవన్ కళ్యాణ్‌తో తన బంధం 17 ఏళ్లదనీ, ఆ బంధాన్ని ఒక్క సంతకంతో ఎలా మర్చిపోగలనంటూ వ్యాఖ్యానించారు. విడాకుల కాగితం పైన సంతకం చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ను మర్చిపోవాలంటే ఎలా అంటూ ఎదురు ప్రశ్నించారు.
పవన్ గురించి మాట్లాడితే... తనేదో పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నానంటూ కొందరు అంటున్నారనీ, ఆయన తన ఇద్దరి పిల్లల తండ్రి అని గుర్తు చేశారు. ఏదో అనుకోకుండా విడాకులయ్యాయనీ, అంతమాత్రాన పవన్ గురించిన జ్ఞాపకాలను వదిలేయడం సాధ్యం కాదంటూ ఆమె చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకున్నా మామధ్య స్నేహం కొనసాగుతుందనీ, పవన్ కళ్యాణ్ ఫోటోలను ఇకపై కూడా పోస్ట్ చేస్తానని తేల్చి చెప్పింది రేణూ దేశాయ్.