బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నార్కోటెక్స్ బ్యూరో విచారణలో డ్రగ్స్ కొన్నట్లు నటి రియా చక్రవర్తి ఒప్పుకుంది. సుశాంత్ కోసమే డ్రగ్స్ కొన్నానని, తన సోదరుడు సోబిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రియా విచారణలో వెల్లడించింది.
ప్రస్తుతానికి దర్యాప్తు ముగిసింది. కానీ రేపు మళ్ళీ విచారణకు హాజరవ్వాలని ఎన్‌సిబి అధికారులు రియాకు సమన్లు జారీ చేశారు. సుశాంత్ చక్రవర్తి లవర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటెక్ బ్యూరోలు రియాను, ఆమె సోదరుడిని విచారిస్తూనే ఉన్నారు.
రియా చక్రవర్తి వ్యవహారం మొత్తం వాట్సాప్ చాట్‌తోనే బయటపడింది. డ్రగ్స్ కొనడం, అమ్మడంతో పాటు ఆమె కూడా తీసుకొనేది. డ్రగ్స్ యాక్ట్ 1980 ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. దీంతో ఆమెను అరెస్టు చేయడం దాదాపు ఖరారైంది. రేపు విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.