రియా పనైపోయింది, ఇక మిగిలింది అరెస్టే, ఎప్పుడంటే?

శనివారం, 5 సెప్టెంబరు 2020 (18:16 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ హత్య కేసులో ఆమె ప్రియురాలు రియా మెడకు ఉచ్చు బిగుస్తోంది. రియా అరెస్టు దాదాపుగా ఖాయమైంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నేడు లేకుంటే రేపు అదుపులోకి తీసుకునే ఛాన్స్ కనబడుతోంది.
 
ముందు నుంచి ఊహించినట్టుగానే సుశాంత్ మృతికి రియానే కారణమన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో మరింత లోతుగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న రియా సోదరుడు సోబిత్ చక్రవర్తితో పాటు సుశాంత్ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
 
సుశాంత్ కేసు కాస్త ఆత్మహత్యగా ముందు అనుకున్నారు గానీ ప్రస్తుతం హత్యగా విచారణ కొనసాగుతోంది. రియా చక్రవర్తి చుట్టూనే సుశాంత్ డెత్ హిస్టరీ కొనసాగుతోంది. రియాపైనే ఆరోపణలు ముందు నుంచి వినిపిస్తున్నాయి. సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళేందుకు కారణమవ్వడమే కాకుండా డ్రగ్స్ కూడా ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
 
ఒకానొక సమయంలో సుశాంత్‌ను రియానే హత్య చేశారన్న ప్రచారం బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు