ఇక ఈ సినిమాలో ప్రమోషన్ కు పలు పాట్లు పడ్డాు. విడుదలకు థియేటర్లు పెద్దగా లేవట. అయినా వున్న కొద్ది థియేటర్లలో మిగిలిన సినిమాలకు టికెట్లు దొరక్కపోతే మా సినిమాకు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇటీవలే జరిగిన కె.సి.ఆర్. ప్రీరిలీజ్ రిలీజ్ వేడుకకు పొలిటికల్ పార్టీకి చెందిన వారితోపాటు దిల్ రాజు వంటి ప్రముఖులను పిలిచాను. కానీ ఒక్క హరీష్ రావు తప్ప ఎవ్వరూ రాలేదు. కమ్యూనిస్టులు అయితే ట్రైలర్ లో ఎర్రజెండా వుందని చూసి మేమూ వస్తామని అడిగి మరీ వచ్చారు అని తెలిపారు.
ఈ సినిమా చేస్తున్నప్పుడు పలు అడ్డంకులు కూడా వచ్చాయి. కొందరైతే ఫోన్ చేసి.. చాలా బిల్డప్ లు ఇచ్చారు. వారు ఎలాంటివారంటే.. రాజకీయనాయుడు దగ్గర వుండే అనుచరులు. ఒక చొక్కానే ఉతికి అదే వేసుకుని తెల్లటి షర్ట్ తో రాజకీయ నాయకుడు దగ్గర వుంటారు. వాటర్ అనగానే.. సార్.. అంటూ హడావుడిగా.. వాటర్ ఇస్తూ.. అదేదో తుంగభద్ర నదిని తెలంగాణాకు తెచ్చిన ఫీలింగ్ తో బిల్డర్ ఇస్తారు. అలాంటివారు రాత్రి ఇంటికి వెళ్ళాక వారి భార్య ముందు.. ఫోన్ చేసి.. ఏంరా, అరే.. మా సార్ మీద సినిమా తీసి ఫోజుకొడుతున్నావ్ రా.. నువ్వు.. అంటారు. పక్కనే వున్న భార్య అమ్మో మా ఆయన ఊరుకోడుబాబోయ్.. పెద్ద వాళ్ళతో పని అంటూ ఆమె పొంగిపోతుంది. ఇలాంటి బిల్డప్ గాళ్ళను సినిమా మేకింగ్ లో చూశాను. ప్రతి ఎం.ఎల్.ఎ.కు నేను సమాధానం చెప్పలేను. అందుకే హరీశ్ రావును కలిశాను. ఆయన పాజిటివ్ గా తీసుకుని వచ్చారు. చాలామందిని పిలిచాను ఫంక్షన్ కు రాలేదు. నేను కష్టపడి సినిమాతీయాలని తీశాను. బాగుంటే ఆదరించండి అన్నారు.