‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ ... చైతూను ఉద్దేశించి సమంత పోస్ట్
ఆదివారం, 26 మార్చి 2017 (12:35 IST)
హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది. అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. సమంత - నాగ చైతన్యలకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా ఆమె చైతూతో ఎంజాయ్ చేస్తుండగా తీసిన ఓ ఫొటోను తన అభిమానులతో పంచుకుంది. ‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో తన ప్రియుడు నాగచైతన్యను ఉద్దేశిస్తూ సమంత పోస్ట్ చేసింది. తనకి ఎప్పటికీ తోడుండాలి అనే అర్థంతో వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె అందులో జత చేసింది.
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఈ ప్రేమికులు సమయం దొరికనప్పుడల్లా తమ ఫ్రెండ్స్‌తో జాలీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత ‘రాజుగారి గది 2’ సినిమాతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇక చైతూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.