ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.860 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసింది.