పవన్‌ సినిమాకు కొత్త చిక్కు.. సాయిపల్లవి ఏం చేస్తుందో..?

శనివారం, 16 జనవరి 2021 (16:13 IST)
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్‌గా సాయిపల్లవి దూసుకుపోతోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ''లవ్ స్టోరీ'' సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది. అలాగే రానా ''విరాటపర్వం'', నానితో `శ్యామ్ సింగరాయ్` సినిమాలు చేస్తోంది. 
 
త్వరలో ప్రారంభం కాబోతున్న పవన్ కల్యాణ్-రానా `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌లో కూడా సాయిపల్లవి కీలక పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ భార్య పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. 
 
అయితే ఆ సినిమాకు డేట్లు కేటాయించడం సాయిపల్లవికి సమస్యగా మారిందట. వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌కు డేట్లు అడ్జెస్ట్ కావడం లేదట. మరి సాయిపల్లవి ఏం చేస్తుందో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు