తెలుగులో ఫస్ట్ నుంచే సమంతని ట్రెండీగానే చూపిస్తున్నారు. సమంత చీరకట్టుతోనే తెలుగు తెరకు పరిచయమైనా ఆ లుక్కుతోనే ఆకట్టుకుంది. అయినా ఆమెను మోడన్ డ్రస్సుల్లోనూ మన దర్శకులు చూపెట్టారు. కానీ తమిళ దర్శకులు మాత్రం ఇటీవల సమంతని చీరకట్టుకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోయే సినిమాల్లో ఆమె అన్నీ మెచ్చూర్డ్ క్యారెక్టర్లే పోషిస్తున్నట్టు సమాచారం.