తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

సెల్వి

శనివారం, 19 ఏప్రియల్ 2025 (14:04 IST)
Car fire
తిరుమలలో కారు దగ్ధమైంది. అయితే అందులో ప్రయాణించిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమలలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది. 
 
ఒంగోలుకు చెందిన నరేంద్ర ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఒంగోలు నుంచి తన కారులో తిరుమలకు బయల్దేరారు. తెల్లవారు జామున తిరుమలకు చేరుకుని స్థానిక సీఆర్పో కార్ పార్కింగ్ వద్ద కారు పార్కు చేశాడు. అకస్మాత్తుగా కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారులోని వారు వెంటనే బయటకు దిగిపోయారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తిరుమలలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇలాంటి  సంఘటనలు చోటుచేసుకోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో అగ్నికి ఆహుతి అయిన కారు

కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కాలిపోయిన కారు..

ఆ దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గట్టిగానే చెబుతున్నాడు.

ఒకదాని తర్వాత ఒకటి వరుస… pic.twitter.com/Wms3GpZpkD

— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) April 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు