ధియేట‌ర్ల‌లోనే సంపూర్ణేష్ బాబు - బ‌జార్ రౌడి

మంగళవారం, 20 జులై 2021 (13:19 IST)
Sampurnesh Babu, Maheshwari
సంపూర్ణేష్ బాబు హీరోగా, కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. డి.వ‌సంత నాగేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్నఈ చిత్రాన్ని సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు. 
 
ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్ మీద త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని చూపించారు, ఈ చిత్రానికి సీనియర్ రైటర్ మరుధూరి రాజా మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు బాగా కుదించారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ఈ చిత్ర క‌థకి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,ష‌ఫి, స‌మీర్ లాంటి పెద్ద న‌టీన‌టుల‌తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాము. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు లో విడుద‌ల చేయ‌నున్నామని అన్నారు
 
ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ, బ‌ర్నింగ్ స్టార్ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో వున్న సంపూని ఇలాంటి ప‌క్కా క‌మ‌ర్షియల్ క‌థ‌లోని ఆయ‌న స్టైల్ ని యాడ్ చేసి తెర‌కెక్కించాము. ప్రేక్ష‌కుల కి న‌వ్వులు, పాట‌లు, ఫైట్స్ కిక్కిచ్చే అన్ని హంగుల‌తో అంద‌రి స‌హ‌యస‌హ‌కారాలతొ పూర్తిచేసాము. ఇటీవలే మా మోద‌టి కాపి చూసిన నిర్మాత చాలా ఆనందంగా వున్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ, బ‌జార్ రౌడి చిత్రాన్ని ఎక్క‌డా ఎవ‌రికి ఇబ్బందిలేకుండా క‌థ విష‌యం లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాము. పెద్ద చిత్రాల‌కి ధీటుగా ఈ చిత్రాన్ని ఈ అగ‌ష్టు లో ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు