వివాహేతర సంబంధాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నట్లు పలు సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. దీనికి కారణం... కార్యాలయాల్లో సుదీర్ఘంగా పనుల్లో నిమగ్నమవడం, తీవ్రమైన మానసిక ఆందోళనలే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. గ్లీడెన్ వంటి యాప్‌ల సర్వేలు బెంగళూరును వివాహేతర సంబంధాలకు అగ్ర నగరంగా పేర్కొన్నాయి. ఐతే అంతకుముందు జూన్ 2025లో ఆష్లే మాడిసన్ నుండి వచ్చిన డేటా ప్రకారం తమిళనాడులోని ఒక చిన్న పట్టణం అయిన కాంచీపురం వివాహేతర సంబంధాల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలలో బెంగళూరు స్థిరంగా ఉన్నత స్థానంలో ఉంది, కానీ తాజా అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ రెండూ నువ్వానేనా అన్నట్లు వున్నాయట.
ఆష్లే మాడిసన్ జూన్ 2025 నివేదిక తమిళనాడులోని కాంచీపురం అనే పట్టణాన్ని వివాహేతర సంబంధాలకు నంబర్ వన్ నగరంగా గుర్తించింది. ఇది దాని మునుపటి ర్యాంకింగ్ నుండి గణనీయమైన పెరుగుదలను చూపించడం గమనార్హం. మరోవైపు గ్లీడెన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల డేటా ఆధారంగా బెంగళూరు నగరం వివాహేతర సంబంధాలలో అగ్రస్థానంలో వున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా ఐటీ, వైద్య రంగాలలో పనిచేసేవారిలోనే అధికంగా వున్నట్లు తేలింది. ఈ రెండింటి తర్వాత ముంబై, కోల్ కతా, ఢిల్లీ, పుణె నగరాలు వున్నాయి.