బైకు ప్రమాదం.. తృటిలో ప్రమాదం నుంచి తప్పుకున్న #SampoorneshBabu (video)

శనివారం, 23 జనవరి 2021 (14:17 IST)
Sampoornesh Babu
నటుడు సంపూర్ణేష్‌బాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫైట్‌ సీన్ల చిత్రీకరణ భాగంగా సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉండే షాట్ తీస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ను తాడుతో కట్టి కిందకు దింపుతుండగా అదుపుతప్పి ఆయన కిందపడిపోయారు.
 
'బజారు రౌడీ' చిత్రం షూటింగ్‌లో పాల్గోంటున్నా సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది సంపూను పైకి లేపి పక్కకు తీసుకెళ్ళారు. ఈ దృశ్యాలను మానిటర్‌లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సంపూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.
 
వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో 'బజారు రౌడీ' చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. కేఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరిగింది. 
 
క్లైమాక్స్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తోన్న సమయంలో హీరో సంపూర్ణేష్ బాబు బైకు పైనుంచి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇక, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. 

PR : *"బజార్ రౌడి క్లైమాక్స్ షూటింగ్ లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కి తృటిలో తప్పిన ప్రమాదం* "

A Small Accident took place in the shooting of @sampoornesh's #BazarRowdy sets!. He's doing well & joins back the sets soon! pic.twitter.com/7rRs83ZkE5

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 23, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు