సంగీత్‌ శోభన్‌ గ్యాంబ్లర్స్‌ నుంచి రాజు ఒక్కడు... సాంగ్‌ విడుదల

దేవీ

గురువారం, 29 మే 2025 (18:16 IST)
Gambler - Sangeeth Shobhan
మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా ఓ స్థానాన్ని సంపాందించుకున్న సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'గ్యాంబ్లర్స్‌'. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవల్లి  సినిమాను నిర్మించిన సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు  నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. 
 
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సినిమా  కాన్సెప్ట్‌ థీమ్‌ సాంగ్‌ '' రాజు ఒక్కడు రాణి ఒక్కతి'' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను సాయిదేవ హర్ష, శశాంక్‌ తిరుపతి, వినాయక్‌, జీకే సంపత్‌, జయశ్రీ ఆలపించారు. శశాంక్‌ తిరుపతి బాణీలు సమకూర్చారు.  
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇది కాన్సెప్ట్‌ థీమ్‌ సాంగ్‌. ఈ సాంగ్‌ సినిమా కాన్సెప్ట్‌ను థీమ్‌ను తెలియజేస్తుంది. ఈ సాంగ్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంటుంది. ' ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో కొత్త సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్‌ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది  అన్నారు. 
 
నిర్మాతలు మాట్లాడుతూ, కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్‌ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు