Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

దేవీ

శుక్రవారం, 28 మార్చి 2025 (12:48 IST)
Mad gang
'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
మ్యాడ్ లో కాలేజీ చదివే నలుగురు కుర్రాళ్ళు కథతో రూపొందింది. ఇప్పుడు అందులో లడ్డుగాడు (విష్ణు) జైల్ లో వుండే ఎపిసోడ్ తో కథ ప్రారంభమవుతుంది. అక్కడ అందరూ లడ్డును చూసి భయపడుతుండడంతో అక్కడవారికి తన స్టోరీ చెబుతాడు. డిడి  (సంతోష్ శోభన్) ఊరిలో సర్పంచ్ కోసం ట్రై చేస్తుంటాడు. అశోక్ (నార్నే నితిన్) సిటీలో వుంటాడు. మనోజ్ (రామ్ నితిన్) బార్ లో పనిచేస్తుంటాడు. లడ్డూ వీరందరిని దూరంగా పెట్టి చెప్పకుండా పెండ్లి చేసుకుంటాడు. అది తెలిసి వారంతా పెండ్లికి అటెండ్ అవుతారు. అక్కడ ఈ ముగ్గురు చేసిన ఓ తప్పిదంతో పెండ్లి కూతురు మరోకరితో లేచిపోతుంది.
 
ఆ ప్రస్టేషన్ నుంచి రిలీఫ్ గా వారంతా లడ్డూనుతీసుకుని గోవాకు వెళతారు. అక్కడ మ్యూజియంలో కోట్ల విలువైన ఆభరణాన్ని ఓ ఇద్దరు దొంగిలిస్తారు. అది ఈ గ్యాంగ్ చేశారని భావించి సత్యం రాజేష్ పోలీస్ అధికారిగా వారిని ఛేజ్ చేస్తాడు. ఈ క్రమంలో అసలు నెక్లెస్ దొంగతనం చేయించిన మ్యాక్స్  భాయ్ (సునీల్) ఈ మాడ్ గ్యాంగ్ దగ్గర నెక్లెస్ వుందని భావించి లడ్డు నాన్న మురళీధర్ గౌడ్ ను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది? ఈ మ్యాడ్ గ్యాంగ్ చేసిన చేష్టలు ఎలా అనిపిస్తాయి? అనేవి మిగిలిన కథ.
 
సమీక్ష:
సినిమా రిలీజ్ కు ముందే లాజిక్కులు లేకుండా కథ కాకరకాయ లేకపోయినా మ్యాజిక్కులు చేసి ఎంటర్ టైన్ చేయడమే మా సినిమా అని ప్రచారం చేశారు. సరిగ్గా అలానే వుంటుంది. మ్యాడ్ గ్యాంగ్ ను పరిచయం చేయడం నుంచి లడ్డుగాడి పెండ్లికి వెళ్ళడం, ఆ తర్వాత  నేరస్తుల ముఠాకు చిక్కడం వంటివన్నీ సన్నివేశపరంగా వినోదాన్ని అందిస్తాయి. హనీమూన్ రిసార్ట్ లో రఘుబాబుతోపాటు దర్శకుడు అనుదీప్ కూడా సన్నివేశపరంగా వినోదాన్ని పంచుతారు. వినోదంతోపాటు లడ్డూగాడి పెండ్లిలో పెల్లికూతురు లేచిపోయే విధానంలో చిన్నపాటి సందేశం కూడా చొప్పించాడు దర్శకుడు. ఇలా ప్రతీ సన్నివేశాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా డైలాగ్స్ తో ఎంటర్ టైన్ చేసే సినిమాగా తీర్చిదిద్దారు.
 
నటనాపరంగా అందరూ బాగానే చేశారు. ఈ సినిమాలో నార్నె నితిన్ ను హీరోగా చూపించే విధానం క్లయిమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. సునీల్, లడ్డూగాడుతోపాటు మురళీధర్ గౌడ్ పాత్ర కూడా ఎంటర్ టైన్ చేయిస్తుంది. టెక్నికల్ గా చూస్తే, భీమ్స్ సంగీతంతోపాటు రీరికార్డింగ్ థమన్ కూడా కథనపరంగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా సరిగ్గానే కట్ చేశారు. ఎక్కడా బోర్ లేకుండా వుంది. కెమెరా పనితనం, నిర్మాణవిలువలు బాగున్నాయి. టైంపాస్ తో అంతా చూడతగ్గ సినిమాగా చెప్పవచ్చు.
రేటింగ్: 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు