సంతోష్ శోభన్, నందినీ రెడ్డి, స్వప్న సినిమాస్ ‘అన్నీ మంచి శకునములే’
సోమవారం, 5 జులై 2021 (15:56 IST)
swapna, nandini, santhosh
ఏక్ మిని కథ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో సంతోష్ శోభన్, అలాగే ఓ..బేబీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఇటీవలే జాతిరత్నాలు వంటి సూపర్‌డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమాస్ కాంబినేషన్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం రానుంది. ఈ సినిమాకు అన్నీ మంచి శకునములే అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు కాబట్టి వీరి మరో బ్లాక్‌బస్టర్ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందరి అంఛనాలకు తగ్గుట్టుగా అన్నీ మంచి శకునములే చిత్రం అద్భుతంగా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
అన్నీ మంచి శకునములే సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. టైటిల్ మాదిరిగానే పోస్టర్ కూడా చాలా ఛార్మింగ్‌గా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌లో మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలోని క్లాసిక్ సాంగ్ అన్నీ మంచి శకునములే నుంచి ఈ సినిమా టైటిల్‌ను తీసుకున్నారు. అలాగే ఆ సాంగ్‌లోని కొంత భాగం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా మనం వినొచ్చు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సంతోష్‌శోభన్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రావు రమేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి, వెన్నెల కిషోర్ లాంటి ప్రామినెంట్ యాక్టర్స్ నటిస్తున్న ఈ చిత్రానికి దావూద్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్, సన్నీ కొర్రపాటి ఛాయగ్రాహకుడు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.