సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:23 IST)
''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

2013లో ''మహాభారత్'' సీరియల్‌లో శ్రీకృష్ణుని పాత్రతో అలరించిన సౌరభ్ తరువాత పలు పౌరాణిక పాత్రలను పోషించారు. 2010లో సౌరభ్.. రిధిమాను వివాహం చేసుకున్నారు.
 
కాగా మహాభారతం టీవీ సీరియల్ ద్వారా కృష్ణుడిగా అందరికీ చేరువైన సౌరబ్.. అక్కినేని నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందిన ఓం నమో వేంకటేశాయలో బాలాజీగా నటనాపరంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు