నాగార్జున 'వైల్డ్ డాగ్'లో సయామీ ఖేర్ (video)

సోమవారం, 27 జనవరి 2020 (20:19 IST)
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ 'మిర్జియా'తో పరిచయమైన నటి సయామీ ఖేర్ ఇతర భాషా చిత్ర సీమల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది తన మరాఠీ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఆమె, దక్షిణాదిన సూపర్ స్టార్ నాగార్జునతో నటించే ఛాన్స్ సంపాదించింది. పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న 'వైల్డ్ డాగ్'లో ఒక యాక్షన్ రోల్ చేసేందుకు సయామీ రెడీ అవుతోంది.
 
యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న 'వైల్డ్ డాగ్' సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. సయామీ 'రా' ఏజెంట్ పాత్రలో కనిపించనున్నది. ఆమెపై కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. దీని కోసం ఆమె ముంబైలో శిక్షణ కూడా తీసుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూలు పూర్తయిన ఈ సినిమా తదుపరి షెడ్యూలులో సయామీ పాల్గొనబోతోంది.
 
ఈ సందర్భంగా సయామీ మాట్లాడుతూ, "ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగార్జున గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన గౌరవం. యాక్షన్ ఫిల్మ్ చెయ్యాలనేది ఎప్పట్నుంచో నాకున్న కోరిక. ఎందుకంటే ఆ జానర్ సినిమాలను నేను ఇష్టపడతాను. కొన్ని రోజులుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. సెట్స్ పై జాయిన్ కావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" అని తెలిపింది.
 
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7'కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ 'వైల్డ్ డాగ్'కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం. అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న 'వైల్డ్ డాగ్' మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.
 
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేతలు మాట్లాడుతూ "ఈ సినిమాలో సయామీ నటిస్తున్నందుకు హ్యాపీ. తనకు సరిగ్గా సరిపోయే పాత్రలో ఆమె కనిపిస్తుంది" అని చెప్పారు.
 
సాంకేతిక వర్గం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచ
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్: డేవిడ్ ఇస్మాలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్స్: సతీష్ పోట్దర్, ప్రశాంత్ దేష్మనే
ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు