"కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ - "కిల్లర్" సినిమా ఔట్ పుట్ మేము అనుకున్నట్లే బాగా వస్తోంది. లవ్, రొమాన్స్, ప్రతీకారం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో మా సినిమాను రూపొందిస్తున్నాం. ఎ మాస్టర్ పీస్ సినిమాతో పాటు మా సంస్థలో వస్తున్న చిత్రంగా "కిల్లర్" మూవీపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాను చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా "కిల్లర్" ఒక స్పెషల్ మూవీగా మీకు గుర్తుండిపోతుంది. అన్నారు.
నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్, తదితరులు