శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పుట్టిన ఆయన పూర్తి పేరు అలీన వెంకట రమణ మూర్తి. ఎ.వి. రమణ మూర్తి హాస్యరసాన్ని పండించే నటుడు. చిన్న తనంలోనే నెహ్రూ పాత్రను వేసి మెప్పించాడు. ఆయన తండ్రి కూడా నటుడే. డిక్షన్, హావభావాలు నటనలో బాగా పలికించేవాడు. బుల్లితెర, హోస్ట్ గా, రంగస్థల నటుడిగా, కె. రాఘవేంద్ర రావు ప్రతి సినిమాలో గతంలో ఒక పాత్ర వుండేది.
ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి అయిన ఆయన పగలు ఉద్యోగం చేసి సాయంత్రం నాటకాలు ఆడేవారు. ఆ తర్వాత అసిస్టెంట్ కమీషనర్ గా ప్రమోషన్ రాగానే నాటక రంగాన్ని బైబై చెప్పారు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించారు. నేడు ఆయన భౌతికకాయం హైదరాబాద్ లోని నాగోల్ లోని స్వగ్రుహంకు తీసుకువచ్చారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.