ప్రపంచ ధనిక నటుల్లో బాలీవుడ్ బాద్‌షాకు రెండో స్థానం

శుక్రవారం, 6 మే 2016 (10:36 IST)
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రపంచ ధనవంతులైన నటుల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా నిలిచిన షారూఖ్, మంచి నటనతో అందరి మనసులను దోచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహా పలు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటులలో షారూఖ్ ఒకరంటే నమ్ముతారా... హాలీవుడ్ నటులైన టామ్ క్రూయిజ్, జాకీచాన్, బ్రాడ్ పిట్ వంటి ధనికులను సైతం వెనక్కి తోసేసి తాను ముందువరుసలో ఉన్నాడు.  
 
ఇక మొదటి స్థానంలో అమెరికన్ హాస్యనటుడు, రచయిత, నిర్మాత జెరోమ్ అలెన్ జెర్రీ సీన్ఫెల్డ్ ఉండగా, రెండోస్థానంలో షారూఖ్ ఖాన్, మూడోస్థానంలో టామ్ క్రూయిజ్ ఉన్నారు. ఇంతకి షారూఖ్ ఖాన్ ఆస్తులేంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే. మొత్తం ఆస్తులేంతో తెలుసా 600 మిలియన్ డాలర్లు. మన భారతీయ రూపాయల్లో 39,791,970,000. 1989టీవీ సీరియల్ ద్వారా నట ప్రస్థానం ఆరంభించిన షారూక్ బాలీవుడ్‌లో నెంబర్ వన్ నటుడిగా నిలిచి, అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. అతడిని దరిదాపుల్లో కూడా బాలీవుడ్‌లో ఎవరూ లేకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి