Sharwanand, Ritu Varma, Vennela Kishore, Priyadarshi
హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.