Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

దేవీ

బుధవారం, 16 ఏప్రియల్ 2025 (15:49 IST)
Shivaraj Kumar, Upendra
సినిమా కథానాయకులు తనకు పలానా జబ్బు వుందని ఎక్కడా పెద్దగా చెప్పుకోరు. కానీ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మాత్రం తనకు కేన్సర్ సోకిందనీ, కిమోథెరపీ చేసుకుంటున్నాననీ అయినా కమిట్ మెంట్ ప్రకారం సినిమా చేశానని నిర్మొహమాటంగా చెప్పారు. రామ్ చరణ్ సినిమా పెద్ది కీలక పాత్ర పోషించారు. తాజాగా సంగీత దర్శకుడు అర్జున్ జన్యా "45" సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.  ఉపేంద్ర కూడా ఇందులో వున్నాడు. హైదరాబాద్ లో 45 టీజర్ లాంఛ్ జరిగింది. 
 
ఈ సందర్భంగా  హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ - దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఎన్నో విషయాలు ఉపేంద్ర నుంచి నేర్చుకున్నాను. ఈ రోజు రాజ్ బి శెట్టి ఈవెంట్ కు రాలేకపోయారు. 45 సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు హీరో. కథే మెయిన్ స్కోర్ చేస్తుంది. డైరెక్టర్ అర్జున్ కు మంచి పేరొస్తుంది. కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. 
 
ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను. నాకు మా మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్నారు కానీ నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా క్యారెక్టర్ కు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను. రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తున్నాను. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించబోతున్నా. అన్నారు.
 
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ - 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన  ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన వందకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో  దర్శకుడు కావడం సంతోషంగా ఉంది.

శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను. ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు