నటి శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ సినిమా తర్వాత మంచి ఫామ్ లోకి వెళ్ళింది. ఆ సినిమా తర్వాత అవకాశాలు చాలా వస్తాయని అనుకున్నారు. కానీ ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. దానికి కారణం చెబుతూ, నాకు తగిన పాత్రలు వస్తే చేస్తాను. నేను పెద్ద అందగత్తెను కాను. ఆరడుగుల అమ్మాయిని కాను చాలా సింపుల్ గా వుంటాను. నేను తినే ఆహారం కూడా సాత్వికంగా వుంటుంది. బెండకాయ కూర ఇష్టంగా తింటాను. ఆకుకూరలు తింటాను అని చెప్పింది.