బేలగా నటి శ్రియ... శ్రీవారిని దర్శించుకుని తలవంచుకుని...(వీడియో)

శనివారం, 26 ఆగస్టు 2017 (17:13 IST)
ప్రముఖ నటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో స్వామి సేవలో శ్రియ పాల్గొన్నారు. తల్లితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న శ్రియకు టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియా మాట్లాడమని కోరగా శ్రియ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. 
 
అయితే శ్రియ గతంలో కంటే స్లిమ్‌గా కనిపించారు. ఆమెకు టాలీవుడ్, బాలీవుడ్‌లలో మొదట్లో అవకాశమొచ్చినా ఆ తరువాత చేతిలో పెద్దగా సినిమాలు లేకుండా పోయిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారిని కనీసం మూడు నెలలకు ఒకసారైనా దర్శించుకోవడానికి వస్తుంటారు శ్రియ. ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఎంతో జోష్‌గా, ఆనందంగా కనిపిస్తుంటారు.
 
కానీ ఈసారి మాత్రం ముబావంగా తలవంచుకుని వెళ్ళిపోయారు. గత కొన్ని నెలలుగా శ్రియ చేతిలో సినిమాలు లేకపోవడం నిరాశకు గురైందని సినీవర్గాలు చెబుతున్నాయి. అందుకే శ్రియ తిరుమలకు వచ్చి స్వామివారిని ప్రార్థించి తన మొరను ఆలకించమని ప్రార్థించినట్లు సినీవర్గాలు భావిస్తున్నాయి. వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు