శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ చిత్రం

సోమవారం, 17 జనవరి 2022 (11:43 IST)
Sivakarthikeyan, Kamal Haasan and ohters
`రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివకార్తికేయన్ క‌థానాయ‌కుడిగా క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం.
ఇంకా  పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు.
 
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా (ఎస్‌పిఎఫ్‌ఐ( బేన‌ర్‌లో ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు  గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.
 
ఈ ఎస్‌పిఎఫ్‌ఐ సంస్థ 2019లో కోలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో మలయాళ చిత్రం ‘నైన్’ చిత్రం నిర్మించింది. తెలుగులో తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబుతో క‌లిసి  ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
ఈ సినిమా ఆర్‌.కె.ఎఫ్‌.ఐ. నిర్మాణంలో 51 వ చిత్రం కావ‌డం విశేషం. ఇటీవ‌లే 50వ చితంగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022 వేసవిలో విడుదల కానుంది.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ, "చక్కటి క‌థ‌, కథనంతో మా బేన‌ర్‌లో 51వ చిత్రం రూపొందుతోంది. ఈ కథ అన్ని ర‌కాలుగా ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నటుడు శివకార్తికేయన్,  దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ఆకట్టుకునే కథను వెండి తెరపైకి తీసుకురానున్నారు.
 
సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణని మాట్లాడుతూ, "తమిళ చిత్రసీమలో మా ప్రస్థానానికి లెజెండ్ మిస్టర్ కమల్ హాసన్,  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి పని చేస్తున్నందుకు మేము చాలా థ్రిల్గానూ  సంతోషంగా ఉంది. క్రియేటివ్ టీమ్ అయిన రాజ్‌కుమార్ పెరియసామి తన కథలు, దర్శకత్వంలో ప‌రిణితి చూపిస్తాడు. ఇక శివకార్తికేయన్ న‌టించ‌డం ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు మరపురాని  అనుభూతిని కలిగిస్తుంది. సోనీ పిక్చర్స్‌లోని క్రియేటివ్ టీమ్ ఈ కథను గుర్తించి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో క‌లిసి గ‌త కొద్దినెల‌లుగా ప‌నిచేసింది.
 తమిళ చలనచిత్ర ప్రపంచంలోకి ఇది మా మొదటి అడుగు, సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియాలో మేము కొత్త తరంతో పాటు ప్రాంతీయ చలనచిత్రాలలో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌ని అన‌కుంటున్నామ‌ని తెలిపారు.
 
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ, "ఈ చిత్రాన్ని సోనీ సంస్థ‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గ‌ర్వంగా వుంది. అద్భుత‌మైన కథను చెప్పడం నాకు త‌గిన గౌర‌వంగా భావిస్తున్నా. నేను కమల్ హాసన్ సర్‌కి ఎప్పటి నుంచో వీరాభిమానిని. ఇక చిన్న‌ప్ప‌టినుంచి శివకార్తికేయన్ నాకు మంచి స్నేహితుడు. క‌నుక‌నే ఈ సినిమా నా హృద‌యానికి తాకింది. అంతేకాకుండా రెండు అగ్ర‌సంస్థ‌ల క‌ల‌యిక‌లో ప‌నిచేయ‌డం చెప్ప‌లేని ఆనందాన్నిస్తుంది అన్నారు.
 
నటుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ విన‌గానే నాలోని అన్ని ఎమోష‌న్స్ వ్య‌క్తం అయ్యాయి.
కమల్ హాసన్ సార్ వంటి అన్ని శాఖ‌ల‌పై ప‌ట్టున్న దిగ్గజ లెజెండ్ నిర్మాతగా నా సినిమాకు వుండ‌డం చెప్ప‌లేని ఆనందంగా వుంది. దానికితోడు .సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్రాండ్ పేరు నా కెరీర్‌లో మ‌రో మైలురాయిలా నిలుస్తుంది.  నా స్నేహితుడు, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి  స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను.ష అని పేర్కొన్నారు.
 
కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివరాలను త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు