భారత సంతతికి చెందిన బ్రిటన్ మోడల్ సోఫియా హయత్ నన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. స్కిన్ షోతో ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నాలు చేసింది. అది చాలదన్నట్టు అమ్మడు సిలికాన్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా తన వక్షోజ సౌందర్యాన్ని వృద్ధి చేసుకుని వాటిని భారీగా ఎక్స్ పోజ్ చేస్తూ బాలీవుడ్‌లో హంగామా చేసింది. అయితే సడన్‌గా ఏం జరిగిందో తెలియదు కానీ జూలై 2015లో జరిగిన సంఘటనతో ఆమెకు జ్ఞానోదయం అయ్యిందని చెప్పింది.
అప్పటి నుండి సన్యాసినిగా మారిపోయాను అంటోంది. దాదాపు 2010 నుండి సొంత మ్యూజిక్ ఆల్బమ్‌లను.. చిన్ని చిన్ని బికినీల్లో అందాలను ఆరబోస్తూ చేసిన పాటలను రిలీజ్ చేసిన సోఫియా, ప్రస్తుతం గయా మథర్ సోఫియాగా పేరు మార్చుకుంది. తనలో ఎలాంటి వాంఛలు లేవని.. సెక్స్ ఇక తనకు అవసరం లేదని తేల్చేసింది. జీవితంలో అన్నీ చూసేశానని.. కేవలం అందరికీ ముక్కి మార్గం బోధించడమే లక్ష్యమని తెలిపింది.
ఇంకా ముంబైలో నన్ అవతారంలో శుక్రవారం కనిపించిన సోఫియా.. ఏకంగా తాను గతంలో వాడిన సిలికాన్ ఇంప్లాంట్‌లను కూడా తీసుకొచ్చి.. ఈ ఫేక్ బ్రెస్టుతో తనకు పనిలేదంటూ వాటిని మీడియా ముందు ఉంచింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. గతంలో రాఖీ సావంత్ కూడా ఇలాగే క్రిస్టియన్ నన్ క్రింద మారిపోయానంటూ రెండు సంవత్సరాలు సన్యాసినిగా కనిపించి.. తర్వాత మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చేశా అనేసింది. మరి సోఫియా ఏం చేస్తుందో..?