Shamshabad govt school opening
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు నా హృదయానికి చాలా దగ్గర. నేను పంజాబీ నుంచి వచ్చినా నా సతీమణీ మాత్రం తెలుగు అమ్మాయి. సినిమా పరంగా నా కెరియర్ కూడా తెలుగు నుంచే మొదలు అయింది. ఇక్కడే నటనలో వృద్ధి చెందాను. అందుకే తెలుగు వాళ్లు అన్నా, తెలుగు అన్నా ప్రత్యేక అభిమానం.. చాలా మంది అంటుంటారు బాలీవుడ్ లో హీరోగా చేస్తావు, తెలుగులో విలన్ గా చేస్తావు ఎందుకు అని, తెలుగులో నటించడం అంటే ఎందుకో చాలా ఇష్టం అందుకే తెలుగు నుంచి ఏ క్యారెక్టర్ వచ్చినా కచ్చితంగా మీ కోసం చేస్తాను.