గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. ఆయన గానం శాశ్వతంగా మూగబోయింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడ్డారు. 50 రోజులపైగా చికిత్స తీసుకున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. కానీ, ఆ వైరస్ శరీర అంతర్గత భాగాలను ముఖ్యంగా ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ అనారోగ్యం నుంచి కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన మృతిపట్ల ప్రతి ఒక్కరూ సంతాపాన్ని తెలుపుతున్నరాు. ఎస్పీ బాలు భౌతికంగా మనకు దూరమైన పాట రూపంలో ఎల్లప్పుడు మన మధ్యే ఉంటారనూ, ఆయనకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను అభిమానులు నెమరవేసుకుంటున్నారు.
1999వ సంవత్సరంలో ఎస్పీ బాలు హోస్ట్ చేస్తున్న 'పాడుతా తీయగా' కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సంగీత సామ్రాట్ బాలమురళీకృష్ణ వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు, మహదేవన్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుశీల కూడా పాల్గొన్నారు.