ఎస్పీబీ కోసం సంగీతప్రియులు సామూహిక ప్రార్థనలు, కన్నీటితో ఎస్పీ చరణ్, నాన్న ఆరోగ్యం గురించి

గురువారం, 20 ఆగస్టు 2020 (22:20 IST)
కరోనా వైరస్ బారినపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానేవుంది. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరంభంలో ఆయన ఆరోగ్యం మెరుగ్గా వున్నప్పటికీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఫలితంగా ప్రత్యేక ఐసీయూ వార్డుకు తరలించి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. 
 
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితుపై ఆయన తనయుడు ఎస్.బి.చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీలేదని చెప్పారు. అయితే, ఆయన కోలుకుంటున్నారన్న ఆశతోనే ఉన్నామని, అభిమానులు, సినీ పరిశ్రమ ప్రార్థనలే తమకు బలాన్నిస్తున్నాయని అన్నారు. తన తండ్రి కోసం సామూహిక ప్రార్థన చేసిన సినీ, సంగీత వర్గాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
 
అయితే, ఓ దశలో ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు కొన్నిరోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

A big thank you for the mass prayers.

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు