స్పైడర్ మాన్, సూపర్ మాన్ స్ఫూర్తిపొందింది మన హను- మాన్ నుంచే : తేజ సజ్జ

సోమవారం, 21 నవంబరు 2022 (16:28 IST)
Teja Sajja, Prashant Varma, Amrita Iyer
హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు.  సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్ అని  హీరో తేజ అన్నారు. 
 
తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హను-మాన్ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు ఊహాతీతమైన కంటెంట్ తో వచ్చారు. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది.
 
ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ,  ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారి కి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయన తో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం.
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా నిర్మాతలు  నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. హను మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్ సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హను మాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఎదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటి సారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హను మాన్ మీద సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే అధీర అనే ఒక సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. హను మాన్ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి జాంబీ రెడ్డి చేశాం. హను మాన్ కి తేజనే ఎందుకు తీసుకున్నామని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్‌ డాగ్‌ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ అలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి.. అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ. విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమా ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళుతున్నాయి. హను మాన్ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం. హను మాన్ పాన్ వరల్డ్ ఫిల్మ్. నిజంగా చాలా గొప్ప సినిమా చేశాం'' అన్నారు
 
అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హను మాన్ టీజర్ అద్భుతమనిపించింది. అనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తేజ సజ్జా మీ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది'' అన్నారు.  ఈ వేడుకలో శ్రీనాగేంద్ర తంగాల, శివేంద్ర, గౌరా హరి, గెటప్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు