ఇంకా మహేష్‌బాబు స్పై ఏజెంట్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమలకణ్ణన్ జాయిన్ అయినట్లు సమాచారం.
కమలకణ్ణన్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ, బాహుబలి సినిమాలకు వంటి సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం స్పైడర్ టీమ్‌తో కమలకణ్ణన్ జాయిన్ కావడంతో స్పైడర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. స్పైడర్ క్లైమాక్స్ సీన్లు రష్యాలో షూట్ చేయనున్నారు. ఈ పనుల్లో ఆయన పాలుపంచుకుంటారని తెలుస్తోంది. బాహుబలి2 తరహాలోనే స్పైడర్‌ను కూడా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా మలిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.