తాజాగా శ్రద్దా తండ్రి ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ శ్రద్దా పెళ్లి గురించి తనతో గతంలో మాట్లాడినట్టు తెలిపారు, అయితే శ్రద్దా మనసులో ఎవరైనా ఉంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. శ్రద్దా ఫ్రెండ్ రోషన్ తో శ్రద్దా పెళ్లి జరగనుండగా అని యాంకర్ అడగగా అది తాను నిర్ణయించలేనని, రోషన్, శ్రద్దా కు ఫ్రెండ్ అని మాత్రమే స్పష్టం చేసారు. అంతేకాక తన పెళ్లి గురించి పూర్తి స్వేచ్ఛ నేను నా కూతురికి ఇచ్చాను అన్నారు శక్తి కపూర్. పెళ్లి అనేది దైవ నిర్ణయం అది మనం నియంత్రించేదికాదు. ఇప్పటి జనరేషన్ ఆలోచనలు, వృత్తిపట్ల అంకితభావం పెరిగాయని కితాబిచ్చాడు. మరి శ్రద్ధా కపూర్ ఏమంటుందో చూద్దాం.